35%పాస్ | Inter Supplementary Results Release | Sakshi
Sakshi News home page

35%పాస్

Jun 24 2016 1:33 AM | Updated on Mar 28 2018 11:26 AM

35%పాస్ - Sakshi

35%పాస్

ఇంటర్మీడియెట్ అడ్వాన్‌‌సడ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఫస్టియర్‌లో 79.59 శాతం ఉత్తీర్ణత

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్మీడియెట్ అడ్వాన్‌‌సడ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 26,815 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 9,349 మాత్రమే పాసై 35 శాతం ఉత్తీర్ణత సాధించారు. వార్షిక పరీక్షల్లో సంతృప్తికరంగా ఫలితాలుండగా.. అడ్వాన్‌‌సడ్ సప్లిమెంటరీలో మాత్రం అతి తక్కువ ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. అదేవిధంగా ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌కు సంబంధించి 88,364 మంది అడ్వాన్‌‌సడ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇందులో ఫెయిల్ అయిన వారితోపాటు ఇంప్రూవ్‌మెంట్ కోసం పరీక్షలు రాసినవారున్నారు. ఈక్రమంలో 70,329 మంది పాసై 79.59శాతం ఉత్తీర్ణత సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement