ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం | inter student suicide | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

Apr 19 2017 10:23 PM | Updated on Nov 6 2018 7:53 PM

మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో బుధవారం.. ఇంటర్‌ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది.

దేవనకొండ: మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో బుధవారం.. ఇంటర్‌ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన దేవనకొండ మండలం డీ కోటకొండ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  గ్రామానికి చెందిన కృష్ణ స్వామిల కుమార్తె సునిత(17) కర్నూలులోని ఓ కళాశాలలో ఇంటర్‌ సీఈసీ గ్రూపు చదివింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో మార్కులు తక్కువచ్చాయని కుంగి పోయింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement