ఇంటర్మీడియట్‌ విద్యార్థి అదృశ్యం | inter student missing | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియట్‌ విద్యార్థి అదృశ్యం

Aug 22 2017 9:51 PM | Updated on Sep 12 2017 12:46 AM

మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి.యాలేరుకు చెందిన పూజారి సాయికుమార్‌ 15 రోజులుగా కనిపించడం లేదు.

ఆత్మకూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి.యాలేరుకు చెందిన పూజారి సాయికుమార్‌ 15  రోజులుగా కనిపించడం లేదు. ఈ మేరకు అతడి తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక్కగానొక్క కుమారుడు ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియరాలేదని విలపిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 73311 43508, 90520 16850, 95730 30173 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement