చెరువులో శవమైతేలిన ఇంటర్ విద్యార్థి | Inter student found dead in lake | Sakshi
Sakshi News home page

చెరువులో శవమైతేలిన ఇంటర్ విద్యార్థి

Mar 19 2016 9:42 AM | Updated on Sep 3 2017 8:08 PM

చిత్తూరు జిల్లా ఐరాల మండలం పందిగొట్టూరు గ్రామానికి చెందిన రాజేష్(19) అనే ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో శనివారం ఉదయం చెరువులో శవమై తేలాడు.

కాణిపాకం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా ఐరాల మండలం పందిగొట్టూరు గ్రామానికి చెందిన రాజేష్(19) అనే ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో శనివారం ఉదయం చెరువులో శవమై తేలాడు. ఆర్‌ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమారుడైన రాజేష్ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.

ఈ మేరకు ఐరాల పోలీస్ స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం పందిగొట్టూరు శివారులోని చెరువులో రాజేష్ శవం తేలడంతో చూసిన స్థానికులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యులు సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. రాజేష్ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement