ప్రశాంతంగా ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు | inter exams peacefull | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు

Mar 2 2017 11:43 PM | Updated on Sep 26 2018 3:25 PM

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.

కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్‌  ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 33, 563 మంది విద్యార్థులకుగాను 32,824 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 739 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైట్లు ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి తెలిపారు. వాస్తవానికి జిల్లాలో పరీక్షకు హాజరుకావాల్సింది 37,912 మంది అని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.  పరీక్ష జరిగిన రోజున మాత్రం ఆదే అధికారులు 33,563 మంది మాత్రమే పరీక్షకు అర్హులని చెబుతున్నారు. రికార్డు పరంగా ఇచ్చిన వివరాల ప్రకారం సుమారు 4,349 మంది విద్యార్థులు తక్కువ చూపుతున్నారెందుకని ఆర్‌ఐఓను అడిగితే మిగతా వారు ఫీజులు కట్టని వారు, హాజరు శాతం తక్కువగా ఉన్న వారు ఉంటారని చెబుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement