చికిత్స పొందుతున్న యవకుడి మృతి | injured person died | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న యవకుడి మృతి

Aug 30 2016 11:42 PM | Updated on Sep 4 2017 11:35 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందాడు. వివరాలు.. మండలంలోని మాచన్‌పల్లి గ్రామ సమీపంలోని నాయకుని తండా చౌరస్తా వద్ద ఆదివారం డీసీఎం బైక్‌ ఢీ కొన్న ఘటనలో పులిమామిడి నవీన్‌ చారి(22) తీవ్రంగా గాయపడ్డాడు.

బొమ్మలరామారం :రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందాడు. వివరాలు..  మండలంలోని మాచన్‌పల్లి గ్రామ సమీపంలోని నాయకుని తండా చౌరస్తా వద్ద ఆదివారం డీసీఎం బైక్‌ ఢీ కొన్న ఘటనలో  పులిమామిడి నవీన్‌ చారి(22) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతున్న నవీన్‌ చారి సోమవారం రాత్రి మతిచెందాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement