గోదావరిలో పెరిగిన ఇన్‌ఫ్లో
కొవ్వూరు :ఎగువన వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వరదనీరు స్వల్పంగా పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఆగస్టు 27న ఇన్‌ఫ్లో 43,266 క్యూసెక్కులకు తగ్గింది. దీనిలో ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాల పరిధిలోని కాలువలకు విడిచిపెట్టగా మిగిలిన 28,766 క్యూసెక్కులు మిగులు జలాలు మాత్రమే సముద్రంలోకి విడిచిపెట్టేవారు.
కొవ్వూరు :ఎగువన వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వరదనీరు స్వల్పంగా పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఆగస్టు 27న ఇన్‌ఫ్లో 43,266 క్యూసెక్కులకు తగ్గింది. దీనిలో ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాల పరిధిలోని కాలువలకు విడిచిపెట్టగా మిగిలిన 28,766 క్యూసెక్కులు మిగులు జలాలు మాత్రమే సముద్రంలోకి విడిచిపెట్టేవారు. ఇటీవల క్రమేణా వరద పెరుగుతోంది. శుక్రవారం ఉదయం గోదావరి నుంచి 2,36,507 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 11,400 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.
పశ్చిమ డెల్టాకి 5 వేల క్యూసెక్కులు
జిల్లాలో ప్రస్తుతం చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండడంతో పశ్చిమ డెల్టా కాలువకు నీటి విడుదలను రెండు రోజుల నుంచి తగ్గించారు. శుక్రవారం 5 వేల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. దీనిలో ఏలూరు కాలువకు 1,079 క్యూసెక్కులు, ఉండి కాలువకు 543, నరసాపురం కాలువకు 1,808, జీ అండ్ వీ కాలువకు 357, అత్తిలి కాలువకు 720 క్యూసెక్కుల చొప్పున నీటిని విడిచిపెడుతున్నారు.