పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను రంగారెడ్డి జిల్లా పరిగి మండలం శిగుపల్లి సమీపంలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
పరిగి: పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను రంగారెడ్డి జిల్లా పరిగి మండలం శిగుపల్లి సమీపంలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో.. అప్రమత్తమైన స్థానికులు ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 11 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.