ఏడడుగుల బంధంతో మొదలైన వారి బంధం మరణంలోనూ వీడ లేదు. తోడు నీడగా దాదాపు 60 సంవత్సరాల కొనసాగిన వారి జీవన ప్రయాణం గురువారంతో ముగిసింది.
నీ వెంటే నేను..
Oct 13 2016 11:57 PM | Updated on Sep 28 2018 3:41 PM
- ఒకే రోజు వృద్ధ దంపతుల మృతి
- అనారోగ్యంతో వృద్ధుడి మృతి
- పది గంటల వ్యవధిలో గుండెపోటుతో వృద్ధురాలి మరణం
పగిడ్యాల: ఏడడుగుల బంధంతో మొదలైన వారి బంధం మరణంలోనూ వీడ లేదు. తోడు నీడగా దాదాపు 60 సంవత్సరాల కొనసాగిన వారి జీవన ప్రయాణం గురువారంతో ముగిసింది. పడమర ప్రాతకోట గ్రామానికి చెందిన దేవరాజు (80), దానమ్మ (70) దందపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా దేవరాజు అనారోగ్యనికి గురయ్యాడు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో కోలుకోలేక ఇంటి వద్దనే మృతి చెందాడు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల తర్వాత దానమ్మ గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. పది గంటల వ్యవధిలో భార్యభర్తలు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుమకుంది.
Advertisement
Advertisement