
పార్టీ మారను, వైఎస్ జగన్ తోనే: రాజన్న దొర
నెల్లూరు జిల్లా అనంతవరం వద్ద ఎన్సీసీ పవర్ ప్రాజెక్ట్లో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
విజయనగరం : జిల్లాలోని బొబ్బిలి రాజులు పార్టీ మారడంతో ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న తమపై కూడా అనుమానాలు ఉండటం సహజమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. కానీ తాను పార్టీ మారేది లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలో రాజన్న దొర మాట్లాడుతూ... రెండుసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను సంపాదించింది ఏమీ లేదన్నారు.
అలాంటిది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా నష్టపోయింది లేదని ఆయన చెప్పారు. ప్రజల కోసం తప్ప ప్రలోభాలకు తలొగ్గే మనిషిని కాదని రాజన్న దొర తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని రాజన్నదొర వెల్లడించారు.