భార్య వియోగంతో జీవితంపై విరక్తిచెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భార్యావియోగం తట్టుకోలేక..
Apr 24 2017 11:47 PM | Updated on Sep 5 2017 9:35 AM
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : భార్య వియోగంతో జీవితంపై విరక్తిచెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్‌ఐ బషీర్‌ఖాన్ తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం లింగదహాళ్‌కు చెందిన బోయ కృష్ణ (35) భార్య రెండు నెలల కిందట చనిపోయింది. అప్పటి నుంచి దిగాలుగా ఉండేవాడు. సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికని వెళ్లి అక్కడే చెట్టుకు ఉరి వేసుకుని అర్ధంతరంగా తనువు చాలించాడు. వీరి ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement