తోడు లేక.. తనువు చాలించాడు! | husband suicides in karavulapalli | Sakshi
Sakshi News home page

తోడు లేక.. తనువు చాలించాడు!

Apr 20 2017 11:24 PM | Updated on Sep 5 2017 9:16 AM

భార్య ఉండగా తరచూ వేధింపులకు గురి చేయడం, గొడవ పెట్టుకోవడంతో విసుగెత్తిన ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.

గోరంట్ల (సోమందేపల్లి) : భార్య ఉండగా తరచూ వేధింపులకు గురి చేయడం, గొడవ పెట్టుకోవడంతో విసుగెత్తిన ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఒంటరి జీవితం అనుభవించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోరంట్ల మండలం కరావులపల్లి తండాలో గురువారం జరిగింది. తండాకు చెందిన బద్రీనాయక్‌(30) చీటికి మాటికీ భార్య తగవులాడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న నాయక్‌ జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. చివరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement