భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య | husband suicides of his wife problem | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

Sep 2 2015 7:24 PM | Updated on Sep 3 2017 8:37 AM

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్య కాపురానికి రాకపోవటంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మధురానగర్ (విజయవాడ): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్య కాపురానికి రాకపోవటంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయవాడ నగరం రాజరాజేశ్వరిపేటకు చెందిన ఎస్‌కే బాజీ (30) స్థానికంగా బీరువాల తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని ఏడాది క్రితం భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు వెళ్లినా ఆమె తనతో రాకపోవటంతో బాజీ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని, తనువు చాలించాడు. సింగ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement