breaking news
wife problem
-
కలహాల కాపురం..
కాపురానికి రానన్న భార్య మనస్తాపంతో భర్త ఆత్మహత్య రామరాజుపల్లిలో విషాదఛాయలు పెళ్లంటే నూరేళ్ల పంట. సాఫీగా సాగిపోవాల్సిన కాపురంలో దంపతుల మధ్య కలహాలు వచ్చాయి. కలిసి ఉండే పరిస్థితి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఉరిపోసుకుని ఊపిరి తీసుకున్నాడు. గుత్తి రూరల్ : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దవడుగూరు మండలం చిట్టూరు రామరాజుపల్లిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రామరాజుపల్లికి చెందిన కూలీ చిన్న తిరుపాలు (26)కు పామిడి మండలం సొరకాయలపేటకు చెందిన ఆశాతో ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఆశా తరచూ పుట్టింటికి వెళ్లేది. అలా వెళ్లినపుడల్లా తిరిగి మెట్టినింటికి వచ్చేకి మొండికేసేది. ఈ క్రమంలో పెద్ద మనుషులు దాదాపు పదిసార్లుపం చాయితీలు కూడా చేశారు. ఇందులో భాగంగా సోమవారం కూడా భార్య ఊరిలోనే మరోసారి పంచాయితీ జరిగింది. భర్తతో కాపురానికి వచ్చేందుకు ససేమిరా అంది. మనస్తాపానికి గురైన తిరుపాలు స్వగ్రామం రామరాజుపల్లికి తిరిగి వచ్చి.. ఆ రాత్రంతా ఆలోచన చేస్తూ ఉండిపోయాడు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి అనంతపురం తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశామని ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
మధురానగర్ (విజయవాడ): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్య కాపురానికి రాకపోవటంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయవాడ నగరం రాజరాజేశ్వరిపేటకు చెందిన ఎస్కే బాజీ (30) స్థానికంగా బీరువాల తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని ఏడాది క్రితం భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు వెళ్లినా ఆమె తనతో రాకపోవటంతో బాజీ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని, తనువు చాలించాడు. సింగ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.