వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Feb 26 2017 10:58 PM | Updated on Sep 5 2017 4:41 AM

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

బొమ్మనహాళ్‌ మండలం లింగదహాళ్‌ గ్రామానికి చెందిన బోయ రేణుకమ్మ (35) శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది.

బొమ్మనహాళ్‌ (రాయదుర్గం) : బొమ్మనహాళ్‌ మండలం లింగదహాళ్‌ గ్రామానికి చెందిన  బోయ రేణుకమ్మ (35) శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న యల్లప్ప ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీరాంశ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు.  బోయ రేణుకమ్మకు లింగదహాళ్‌ బోయ కృష్ణయ్యతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే  మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement