భార్యపై కత్తితో దాడి చేసిన భర్త | husband attacks on wife with knife | Sakshi
Sakshi News home page

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

Mar 6 2017 12:28 AM | Updated on Sep 5 2017 5:17 AM

పుట్లూరు (శింగనమల) : పుట్లూరు మండలంలోని గొల్లపల్లిలో సర్వస్వతి అనే మహిళపై ఆమె భర్త దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. మద్దలపల్లి గ్రామానికి చెందిన రమేష్, గొల్లపల్లి గ్రామానికి చెందిన సరస్వతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.

పుట్లూరు (శింగనమల) : పుట్లూరు మండలంలోని గొల్లపల్లిలో  సర్వస్వతి అనే మహిళపై ఆమె భర్త దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. మద్దలపల్లి గ్రామానికి చెందిన రమేష్, గొల్లపల్లి గ్రామానికి చెందిన సరస్వతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో నాలుగేళ్లుగా సరస్వతి పుట్టింటి వద్దే ఉంటోంది. భార్యపై అనుమానంతో  రమేష్‌  ఆదివారం కత్తితో దాడి చేశాడు.  దాడిని అడ్డుకోబోయిన  సరస్వతి అక్క చంద్రకళ  కూ స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన సరస్వతిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో  మెరుగైన చికిత్సకోసం అనంతపురానికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement