మొదలైన వజ్రాల వేట | hunting for diamonds Began | Sakshi
Sakshi News home page

మొదలైన వజ్రాల వేట

Jun 27 2016 7:15 PM | Updated on Sep 4 2017 3:33 AM

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని సర్వ నరసింహస్వామి ఆలయ సమీపంలో పారుతున్న వక్కిలేరు వాగు వెంట వజ్రాల అన్వేషణ మొదలయింది.

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని సర్వ నరసింహస్వామి ఆలయ సమీపంలో పారుతున్న వక్కిలేరు వాగు వెంట వజ్రాల అన్వేషణ మొదలయింది. తొలకరి వర్షాలతో ఈ ప్రాంతంలో ప్రజలు గుంపులుగా వచ్చి రోజంతా పుల్లలతో గాలించడం పరిపాటి. భారీ వర్షాలు కురిసి వాగులో నీటి ప్రవాహం పెరిగే వరకు శిరివెళ్ల, రుద్రవరం, నంద్యాల, మహానంది మండలాలతో పాటు ప్రకాశం జిల్లా నుంచి కూడా ప్రజలు తమ అదష్టం పరీక్షించుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడి తరలివస్తున్నారు.

 

రాయి మెరిసిందంటే చాలు చటుక్కున పట్టేసుకుని.. చడీచప్పుడు లేకుండా ఇక్కడి నుంచి జారుకుంటుంటారు. అధికంగా వీటిలో రంగు రాళ్లు ఉంటున్నాయని తెలుస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పగలంతా వాగు వెంట గాలింపు చేపట్టి.. రాత్రికి గాజులపల్లె వీరబ్రహ్మం గుడి వద్ద సేదతీరుతున్నారు. చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు మోటార్ సైకిళ్లపైనా వస్తుండటం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement