మాంసం వదిలి పరార్.. | Hunters kill forest animals | Sakshi
Sakshi News home page

మాంసం వదిలి పరార్..

Jun 23 2016 2:49 PM | Updated on Sep 4 2017 3:13 AM

మాంసం వదిలి పరార్..

మాంసం వదిలి పరార్..

ఖానాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా జంతువులను వేటాడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.

ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : ఖానాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా జంతువులను వేటాడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు దుప్పులు, ఒక మనుబోతు కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వస్తున్నారని గుర్తించిన వేటగాళ్లు.. మాంసంతో పాటు, వేటాడానికి వినియోగించిన పరికరాలను అక్కడే వదిలి పరారయ్యారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement