170 క్వింటాళ్ల బియ్యం పట్టివేత | huge ration rice seized in gajapathinagaram | Sakshi
Sakshi News home page

170 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

May 26 2016 11:09 AM | Updated on Apr 4 2019 2:50 PM

నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారనే అనుమానంతో 170 క్వింటాళ్ల బియ్యాన్ని స్థానిక తహశీల్దార్ ఆర్‌ఎల్‌ఎల్ ప్రసాద్‌పాత్రో పట్టుకున్నారు.

గజపతినగరం: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారనే అనుమానంతో 170 క్వింటాళ్ల బియ్యాన్ని స్థానిక తహశీల్దార్ ఆర్‌ఎల్‌ఎల్ ప్రసాద్‌పాత్రో పట్టుకున్నారు. పౌరసరఫరాల శాఖ అనుమతి లేకుండా జిన్నాం గ్రామ సమీపంలో ఉన్న రామాంజనేయ రైస్ మిల్ యజమాని బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తహశీల్దార్ ప్రసాద్ పాత్రో బుధవారం రాత్రి గ్రామ సమీపంలో కాపు కాసి బియ్యాన్ని సీజ్ చేశారు. విషయూన్ని ఏజేసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తహశీల్దార్ తెలిపారు. ఇదిలాఉంటే మిల్లు యజమాని కొప్పల రామునాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement