నాగుల చవితి సందర్భంగా పూజలు నిర్వహించుకుంటున్న మహిళలపై తేనెటీగలు దాడి చేశాయి.
బయ్యారం: నాగుల చవితి సందర్భంగా పూజలు నిర్వహించుకుంటున్న మహిళలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గందంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
	గ్రామానికి చెందిన మహిళలు పూజలు చేసుకునేందుకు గ్రామ శివారులోని పుట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ చెట్టుకు ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో.. నలుగురు మహిళలకు గాయాలయ్యాయి.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
