షవర్ల కిందే పుష్కర స్నానాలు.. | holy bath is with water shawars with lack of water | Sakshi
Sakshi News home page

షవర్ల కిందే పుష్కర స్నానాలు..

Jul 15 2015 11:42 AM | Updated on Aug 1 2018 5:04 PM

నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు, తడపాకల్, ఉమ్మెడ, తుంగిని పుష్కర ఘాట్ల వద్ద భారీ సంఖ్యలో యాత్రికులు పుష్కర స్నానాలు ఆచరించారు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు, తడపాకల్, ఉమ్మెడ, తుంగిని పుష్కర ఘాట్ల వద్ద భారీ సంఖ్యలో యాత్రికులు పుష్కర స్నానాలు ఆచరించారు. కందకుర్తి, తాడ్ బిలోలిలో నీళ్లు లేక షవర్ల కిందే స్నానాలు చేస్తున్నారు. ఈ ఘాట్లలో అన్ని చోట్ల భద్రత పెంచడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గోదావరి పుష్కరాల కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. రెండో రోజు కూడా భక్తులు నీళ్లు లేకపోవడంతో  పుష్కర స్నానాలు ఆచరించడానికి ఇబ్బందులు పడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement