పోలాకిలో ఉద్రిక్తత | high tension in polaki | Sakshi
Sakshi News home page

పోలాకిలో ఉద్రిక్తత

Jul 6 2016 11:46 AM | Updated on Sep 4 2017 4:16 AM

శ్రీకాకుళం జిల్లా పోలాకిలో థర్మల్ పవర్ ప్లాంట్ సర్వేను బుధవారం స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పోలాకిలో థర్మల్ పవర్ ప్లాంట్ సర్వేను బుధవారం స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే ప్లాంట్ కోసం జిల్లాలోని  చీడివలస, గవరంపేట, గోవిందరాజులపేట గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సదరు గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

తమ నిరసన తెలిపేందుకు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన ఆయా గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో సదరు గ్రామాల ప్రజలు పోలీసుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సర్వేను ఎలాగైనా అడ్డుకుని తీరతామని ఉద్యమకారులు స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement