దమ్మాయగూడెంలో ఉద్రిక్తత | high tension in dammaiguda | Sakshi
Sakshi News home page

దమ్మాయగూడెంలో ఉద్రిక్తత

Jul 16 2016 11:42 AM | Updated on Mar 28 2018 11:26 AM

ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని రంగారెడ్డి జేసీ ఆదేశాల జారీ చేశారు.

కీసర : ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని రంగారెడ్డి జేసీ ఆదేశాల జారీ చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు కీసర మండలం దమ్మాయగూడలోని అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నారు. దీంతో అధికారుల ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు.

తమను నిరాశ్రయులను చేస్తే.. ఎక్కడికి పోతామంటూ వారు ఆక్రోశించారు. అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి స్థానికులను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement