బ్యాగులు తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ తులసీరామ్, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది
తిరుమలలో శనివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేశారు.
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తిరుమలలో టూ టౌన్ సీఐ వెంకటరవి నేతత్వంలో శనివారం తులసీరామ్, బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం, తిరుమలలోని గరుడాద్రినగర్ తనిఖీ కేంద్రంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిషేధిత గుట్కా, సిగరెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనుమానం వచ్చిన ప్రతి భక్తుడి విచారించడంతో పాటు వ్యక్తిగత వివరాలను నమోదు చేశారు. ఆలయంతోపాటు అన్నప్రసాద కేంద్రం, కల్యాణకట్ట, రద్దీ ఉండే ముఖ్య కూడళ్లలలోనూ నిఘాను పెంచారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వాహన రికార్డులు తనిఖీ చేశారు.