చేతులు లేకున్నా.. | handicapped student got first class in inter result | Sakshi
Sakshi News home page

చేతులు లేకున్నా..

Apr 20 2016 9:16 AM | Updated on Sep 3 2017 10:21 PM

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండల పరిధిలోని నాయిరాలవలస గ్రామానికి చెందిన కొవ్వాడ స్వప్న రెండు చేతులు లేకపోయినప్పటికీ చదువులో తన ప్రతిభను చాటుకుంటోంది.

రేగిడి : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండల పరిధిలోని నాయిరాలవలస గ్రామానికి చెందిన కొవ్వాడ స్వప్న రెండు చేతులు లేకపోయినప్పటికీ చదువులో తన ప్రతిభను చాటుకుంటోంది. ద్వితీ య సంవత్సరం ఇంటర్మీడియెట్‌లో 725 మార్కులు ఎంపీసీ గ్రూపులో సాధించిం ది. ఈమె రాజాం ఉమెన్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్నను వావిలవలస గ్రామానికి చెందిన సామాజిక వేత్త పాలూరి సిద్ధార్థ.. దాతల సహకారంతో చదివిస్తున్నారు. చదువుపై మమకారం ఉండడంతో ఇంటర్మీడియెట్‌లో మంచి మార్కులు సాధించడం పట్ల ఎంఈవో ప్రసాదరావుతోపాటు పాలూరి సిద్ధార్థ స్వప్నను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement