పాఠశాలలో చేతి పంపు ప్రారంభం | hand-pump inaugarated at school | Sakshi
Sakshi News home page

పాఠశాలలో చేతి పంపు ప్రారంభం

Oct 15 2016 10:44 AM | Updated on Sep 15 2018 4:12 PM

మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం బాల వికాస ఆధ్వర్యంలో వేసిన చేతి పంపును ఉపసర్పంచ్‌ ఉప్పలయ్య ప్రారంభించారు.

లింగాలఘణపురం: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం బాల వికాస ఆధ్వర్యంలో వేసిన చేతి పంపును ఉపసర్పంచ్‌ ఉప్పలయ్య ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా పాఠశాలలో తాగునీటి సమస్య ఉండడంతో సమస్యను స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళ్లగా బోరువెల్‌ వేసి చేతి పంపును అమర్చారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకనాధం, ఉపాధ్యాయులు, గ్రామ యువకుల సహకారంతో రూ.6వేలు చెల్లించగా, మిగతా రూ.32వేలు బాల వికాస ఆర్థిక సహాయం చేసి బోరు డ్రిల్లు చేసి చేతి పంపును అమర్చారు. పాఠశాలలోని విద్యార్థులకు తాగునీటి సమస్య తీరడంలో సహకరించిన స్వచ్ఛంద సంస్థకు గ్రామస్తులు, హెడ్మాస్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ భీమయ్య, ఉపాధ్యాయులు భగవాన్ రెడ్డి, సత్యనారాయణ, వెంకటయ్య, శ్రీనివాసు, వంశీ, హేమలత, మాధవిలత, సుమతి,  రంజిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement