గుట్కా, ప్యాకెట్ల, పట్టివేత | Gutka pockets catch | Sakshi
Sakshi News home page

గుట్కా, ప్యాకెట్ల, పట్టివేత

Oct 2 2016 12:04 AM | Updated on Sep 4 2017 3:48 PM

పట్టుబడిన గుట్కాలను చూపిస్తున్న సీఐ రాజేంద్రప్రసాద్‌

పట్టుబడిన గుట్కాలను చూపిస్తున్న సీఐ రాజేంద్రప్రసాద్‌

సత్తుపల్లి పట్టణానికి రవాణా చేస్తున్న రూ.77 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ పి.రాజేంద్రప్రసాద్‌ కథనం ప్రకారం హైదరాబాద్‌ నుంచి సత్తుపల్లికి హోల్‌సేల్‌గా గుట్కా ప్యాకెట్లను కారులో రవాణా చేస్తున్న ముఠాను పక్కా సమాచారంతో వాహనాల తనిఖీలో పట్టుకున్నట్లు తెలిపారు.

సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణానికి రవాణా చేస్తున్న రూ.77 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ పి.రాజేంద్రప్రసాద్‌ కథనం ప్రకారం హైదరాబాద్‌ నుంచి సత్తుపల్లికి హోల్‌సేల్‌గా గుట్కా ప్యాకెట్లను కారులో రవాణా చేస్తున్న ముఠాను పక్కా సమాచారంతో వాహనాల తనిఖీలో పట్టుకున్నట్లు తెలిపారు. సత్తుపల్లిలో ఎండీ అఖిల్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ జహంగీర్‌తో కలిసి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను చేరవేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఖమ్మం పట్టణానికి చెందిన కారు డ్రైవర్ ఎస్‌కే షహబుద్దీన్‌ సహకారం అందించాడని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. తనిఖీల్లో ఏఎస్సై రామచంద్రరాజు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు బి.వెంకటేశ్వరరావు, రాజేష్‌ ఉన్నారు.

ఫోటో నెంబరు: 01ఎస్‌పిఎల్‌01, రైటప్‌ : పట్టుబడిన గుట్కాలను చూపిస్తున్న సీఐ రాజేంద్రప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement