వెబ్‌సైట్‌లో గురుకుల విద్యార్థుల ఎంపిక జాబితా | gurukulas selected list in website | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో గురుకుల విద్యార్థుల ఎంపిక జాబితా

Aug 25 2016 12:08 AM | Updated on Sep 4 2017 10:43 AM

గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ కృష్ణారావు  ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన 21 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతులలో ప్రవేశానికి జూన్‌ 26న ప్రవేశ పరీక్ష నిర్వహించిందని పేర్కొన్నారు. పరీక్షల్లో ఎంపికై సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు వెబ్‌సైట్‌ www.tswreis.mbnrgov.in ఉన్నాయని పేర్కొన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులు ఈనెల 31లోపు ఆయా పాఠశాలల్లో రిపోర్టు చేయాలని తెలిపారు. కులం, ఆదాయం, బోనోఫైడ్, టీసీ, ఆధార్‌కార్డు జిరాక్స్, రేషన్‌కార్డు జిరాక్స్‌ తదితర సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement