బైక్‌లను కాల్చిన ఆకతాయిలు | Grilled brats bikes | Sakshi
Sakshi News home page

బైక్‌లను కాల్చిన ఆకతాయిలు

Sep 9 2016 10:10 PM | Updated on Sep 4 2017 12:49 PM

బైక్‌లను కాల్చిన ఆకతాయిలు

బైక్‌లను కాల్చిన ఆకతాయిలు

పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు మోటార్‌ బైక్‌లను గుర్తు తెలియని దుండగులు కాల్చారు.

ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు మోటార్‌ బైక్‌లను గుర్తు తెలియని దుండగులు కాల్చారు. కోనేటికాల్వ వీధిలో ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్న ప్రకాష్‌ తన స్పెలండర్‌ ప్లస్‌ ద్విచక్ర వాహనాన్ని రాత్రి సమయాల్లో ఇంటి ముందు పార్కింగ్‌ చేస్తారు. ఈ క్రమంలో గురువారం రాత్రి పార్కింగ్‌ చేయగా శుక్రవారం వేకువ జామున 2.45 సమయంలో రహదారి మీదుగా వెళ్లే వ్యక్తులు బైక్‌ కాలుతోందని కేకలు వేశారు. దీంతో ప్రకాష్‌ పరుగెత్తుకుంటూ బయటికి రాగా తన బైక్‌ మంటల్లో తగలబడి పోతోంది. వెంటనే నీళ్లు పోసి మంటలను ఆర్పారు. ఈ మేరకు ప్రకాష్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే భావనారుషి ఆలయం సమీపంలోనూ, ప్రకాష్‌నగర్‌లలో కూడా రెండు బైక్‌లను ఆకతాయిలు కాల్చారు. అయితే వాటి యజమానుల నుంచి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement