కుడాకు గ్రీన్‌ సిగ్నల్‌ | green signal for KUDA | Sakshi
Sakshi News home page

కుడాకు గ్రీన్‌ సిగ్నల్‌

Oct 18 2016 11:19 PM | Updated on Sep 4 2017 5:36 PM

కుడాకు గ్రీన్‌ సిగ్నల్‌

కుడాకు గ్రీన్‌ సిగ్నల్‌

కర్నూలు నగర పరిధి మరింత విస్తరించనుంది. చుట్టుపక్క మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కలుపుకొని కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

– మంత్రిమండలి ఆమోదం
 
కర్నూలు(టౌన్‌): కర్నూలు నగర పరిధి మరింత విస్తరించనుంది. చుట్టుపక్క మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కలుపుకొని కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కుడా పరిధిలో కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు, డోన్‌ నగర పంచాయతీలు విలీనం కానున్నాయి. అదేవిధంగా కల్లూరు, జూపాడుబంగ్లా, మిడుతూరు, ఓర్వకల్లు, కోడుమూరు, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, మహానంది మండలాలు కూడా ఈ పరిధిలోకి రానున్నాయి. 
 
 
మంత్రిమండలి ఆమోదంతో పాటు రివాల్వింగ్‌ ఫండ్‌ కింద రూ.50 కోట్లు మంజూరు చేసింది. 219 గ్రామాలను కలుపుకుని కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఏర్పాటు కానుంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో భాగంగా పలు పంచాయతీలను నగర పంచాయతీలుగా, నగర పంచాయతీలను మున్సిపాల్టీలుగా, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా, కార్పొరేషన్లను పట్టణ అభివృద్ధి సంస్థలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పట్టణాభివృద్ధి అథారిటీ బిల్‌ 2015 ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. పట్టణాభివృద్ధి అథారిటీలకు ప్రభుత్వమే చైర్మన్‌లను నియమిస్తుంది.
 
కుడాపై దృష్టి సారించిన అధికారులు
కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీపై ఆరు నెలలుగా నగరపాలక అధికారులు కసరత్తు ప్రారంభించారు. 1994 సంవత్సరంలో కర్నూలు మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయింది. 2002 ఫిబ్రవరిలో కల్లూరు మేజర్‌ గ్రామ పంచాయతీని కర్నూలు కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ప్రస్తుతం నగర విస్తీర్ణం 49.74 చదరపు కిలోమీటర్లు కాగా.. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,23,829 మంది జనాభా ఉన్నారు. అలాగే మురికివాడల్లో నివసిస్తున్న జనాభా 1,43,797.
––––––––––––––––––––––
మున్సిపాల్టీ/మండలాలు విస్తీర్ణం 2011 జనాభా లెక్కల
చ.కి.మీ ప్రకారం
––––––––––––––––––––––––––––
1. కర్నూలు (అర్బన్‌)   355.72 4,06,737
2. కల్లూరు               327.01 1,96,288
3. గూడూరు (అర్బన్‌) 163.08 46,286
4. నందికొట్కూరు (అర్బన్‌) 177.13 83,748
5. జూపాడుబంగ్లా        226.70 37,686
6. మిడుతూరు           302.74 41,652
7. ఓర్వకల్లు             371.72 58,487
8. కోడుమూరు         287.06 74,594
9. వెల్దుర్తి                334.62 63,120
10. బేతంచర్ల           296.25 88,726
11. పాణ్యం            283.29 51,428
12. గడివేముల        243.53 42,310
13. నంద్యాల (అర్బన్‌) 217.08 2,83,368
14. మహానంది       259.64 38,487
15. డోన్‌ (అర్బన్‌)     430.28 1,20,232
–––––––––––––––––––––––––––––––––
మొత్తం 4224.82 16,19,587
––––––––––––––––––––––––––––––––
 

Advertisement
 
Advertisement
Advertisement