ఈ అవ్వకు 102 ఏళ్లు! | grand mother at age of 102 years | Sakshi
Sakshi News home page

ఈ అవ్వకు 102 ఏళ్లు!

May 7 2017 11:00 PM | Updated on Mar 28 2019 6:33 PM

ఈ అవ్వకు 102 ఏళ్లు! - Sakshi

ఈ అవ్వకు 102 ఏళ్లు!

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలోని అవ్వ పేరు బోయ సుంకమ్మ. కూడేరు మండలం అంతరగంగ గ్రామానికి చెందిన ఈమె వయసు ఎంతనుకున్నారు.

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలోని అవ్వ పేరు బోయ సుంకమ్మ. కూడేరు మండలం అంతరగంగ గ్రామానికి చెందిన ఈమె వయసు ఎంతనుకున్నారు... 102 ఏళ్లు! అబ్బో అని ఆశ్చరపోతున్నారా? నిజమేనండీ బాబూ.. ఆ గ్రామస్తులు చెబుతున్నదానిని బట్టి చూస్తే అవ్వకు 102 ఏళ్లు అనేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఇంత వయసు వచ్చిన ఇంకా ఆరోగ్యంగానే ఉన్న ఈ అవ్వకు తోడుగా ఓ మనవడు ఉన్నాడు. అతను కూడా ఉద్యోగరీత్య మరో ప్రాంతానికి వెళ్లి వస్తుంటాడు. ఇక అవ్వకు బీపీ లేదు.. షుగరూ లేదు! ఇక కంటి చూపు సమస్యలంటరా? కళ్లకు అద్దాలు పెట్టుకున్న సందర్భాన్ని తామెన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు.

ఇంటి, వంట పనులూ అవ్వనే చేస్తుంటుంది. ఒకరి సాయం లేకుండా నడుస్తుంది. ఇక అవ్వ దగ్గర బోలెడు కథలు వినేందుకు పిల్లలతో పాటు పెద్దలూ ఆసక్తి చూపుతుంటారు. ఇంతకు అవ్వ ఆరోగ్య రహస్యమేమిటంటారా? అయితే ఈ విషయంగా అవ్వనే అడిగితే.. ‘కొర్ర అన్నం, రాగిముద్ద, జొన్న రొట్టెలు ఆహారంగా తీసుకోవడంతో పాటు వయసు పైబడే వరకూ నిరంతర వ్యవసాయ పనులు చేయడమేనని చెబుతున్నారు. ఔరా! భలే అవ్వరా!! అని కితాబునిస్తున్నారా.. అయితే ఓకే.
- కూడేరు (ఉరవకొండ)

Advertisement
 
Advertisement
Advertisement