జాబ్‌మేళాకు విశేష స్పందన | good responce for job mela | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాకు విశేష స్పందన

Sep 24 2016 11:35 PM | Updated on Sep 4 2017 2:48 PM

లూరు గవరవరంలోని సెయింట్‌ థెరిస్సా స్వయం ప్రతిపత్తి డిగ్రీ మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన జా»Œ æమేళాకు విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా జాబ్‌మేళాకు 1,561 మంది విద్యార్థులు హాజరై ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఐసీఐసీఐ, అడెకో, కొటాక్, ఫస్ట్‌సోర్స్, హెచ్‌సీఎల్, అటిక్స్‌ కంపెనీల ప్రతినిధులు హాజరై విద్యార్థులకు ఇంటర్వూ్యలు నిర్వహించారు

ఏలూరు సిటీ : ఏలూరు గవరవరంలోని సెయింట్‌ థెరిస్సా స్వయం ప్రతిపత్తి డిగ్రీ మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన జా»Œ æమేళాకు విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా జాబ్‌మేళాకు 1,561 మంది విద్యార్థులు హాజరై ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఐసీఐసీఐ, అడెకో, కొటాక్, ఫస్ట్‌సోర్స్, హెచ్‌సీఎల్, అటిక్స్‌ కంపెనీల ప్రతినిధులు హాజరై విద్యార్థులకు ఇంటర్వూ్యలు నిర్వహించారు. ఈ జాబ్‌మేళాను సెయింట్‌ థెరిస్సా డిగ్రీ కళాశాల వికాస్‌ ట్రైనింగ్‌ సెంటర్, నన్నయ్య యూనివర్సిటీతో కలిసి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో నిర్వహించినట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.మెర్సి తెలిపారు. ఈ జాబ్‌మేళాలో ఐసీఐసీఐలో ఉద్యోగాల కోసం 265 మంది, అడెకో సంస్థకు 175 మంది, కొటాక్‌కు 304, ఫస్ట్‌సోర్స్‌ 161 మంది, హెచ్‌సీఎల్‌ 156, అటిక్స్‌ 500 మంది ఉద్యోగాలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి సరస్వతి దేవి, అధ్యాపకులు ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement