రైల్వేస్టేషన్‌లో నగలు అపహరణ | gold theft in train | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో నగలు అపహరణ

Mar 11 2017 11:30 PM | Updated on Sep 5 2017 5:49 AM

హిందూపురం రైల్వేస్టేషన్‌ శనివారం రాత్రి బెంగళూరు నుంచి వస్తున్న దంపతుల వద్ద 10 తులాలు బంగారు నగలు అపహరించుకుపోయినట్లు బాధితులు రా«ధాకృష్ణ, మమతలు వాపోయారు.

హిందూపురం అర్బన్‌ : హిందూపురం రైల్వేస్టేషన్‌ శనివారం రాత్రి బెంగళూరు నుంచి వస్తున్న దంపతుల వద్ద 10 తులాలు బంగారు నగలు అపహరించుకుపోయినట్లు బాధితులు రాధాకృష్ణ, మమతలు వాపోయారు. బెంగళూరు నుంచి కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి 8 గంటల సమయంలో హిందూపురం రైల్వేస్టేషన్‌లో దిగారు. వీరిని అనుసరిస్తున్న దొంగ బంగారు నగలు కలిగిన బ్యాగ్‌ను లాక్కొని పరారు అయ్యాడు. దొంగను పట్టుకోవడానికి రాధాకృష్ణ ప్రయత్నించా ఫలితం లేకపోయింది. దీంతో రైల్వే పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయాన్ని తెలియజేసి కేసు నమోదు చేయాలని కోరారు. అయితే పోలీసులు ఎస్‌ఐ అందుబాటులో లేరని ఫిర్యాదు తీసుకోలేమని చెబుతున్నట్లు బాధితులు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement