కూరగాయల మార్కెట్ లో వివాహిత వద్ద నుంచి ఓ మాయలేడి మంగళసూత్రం కాజేసింది.
కీసర: కూరగాయల మార్కెట్ లో వివాహిత వద్ద నుంచి ఓ మాయలేడి మంగళసూత్రం కాజేసింది. ఈ ఘటన మేడ్చెల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం గ్రామంలో చోటుచేసుకుంది. నకిలీ బంగారం ముద్ద చూపించి ఇది మన ఇద్దరికీ దొరికింది అని నమ్మబలికి, ఒక మహిళ దగ్గర ఉన్న నాలుగున్నర తులాల మంగళసూత్రంతో గుర్తుతెలియని మహిళ ఉడాయించింది. బంగారం దుకాణానికి వెళ్లి పరీక్షించగా బంగారం ముద్ద నకిలీదని దుకాణం యజమాని తేల్చి చెప్పాడు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత మహిళ కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.