గోకార్టింగ్‌ చాంపియ న్‌ షిప్‌ పోటీలు ప్రారంభం | gocarting champion ship games start | Sakshi
Sakshi News home page

గోకార్టింగ్‌ చాంపియ న్‌ షిప్‌ పోటీలు ప్రారంభం

Jan 28 2017 12:42 AM | Updated on Sep 5 2017 2:16 AM

భీమవరం : భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో జాతీయస్థాయి గోకార్టింగ్‌ చాంపియ న్‌ షిప్‌ పోటీలు శుక్రవారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

భీమవరం : భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో జాతీయస్థాయి గోకార్టింగ్‌ చాంపియ న్‌ షిప్‌ పోటీలు శుక్రవారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు కేవలం తరగతి గదుల్లో విద్యాభ్యాసానికే పరిమితం కాకుండా వివిధ నూతన ఆవిష్కరణలకు నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను ప్రదర్శించడానికి ఈ పోటీలు వేదిగా నిలుస్తాయననారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసరాజు మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో ఆరు రాష్ట్రాల నుంచి 31 జట్లు పాల్గొంటున్నాయన్నారు. అనంతరం ఎస్పీని దుశ్శాలువాతో సత్కరించారు. ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఆరిఫ్, విష్ణు విద్యా సంస్థల డైరెక్టర్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement