గండికోటకు హోదా ఇవ్వండి | give special status to gandikota | Sakshi
Sakshi News home page

గండికోటకు హోదా ఇవ్వండి

Oct 6 2016 7:48 PM | Updated on Aug 18 2018 8:53 PM

గండికోటకు హోదా ఇవ్వండి - Sakshi

గండికోటకు హోదా ఇవ్వండి

వైఎస్సార్‌ జిల్లాలోని గండికోట ప్రపంచంలోనే అరుదైన ప్రాంతమని ఈ ప్రదేశానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించాలని గండికోట ప్రాధికార సంస్థ చైర్మన్‌ (గండికోట రాజ వారసుడు) పెమ్మసాని ప్రభాకర్‌నాయుడు ప్రొఫెసర్‌ జయరామిరెడ్డిని కోరారు.

కడప కల్చరల్‌:
 వైఎస్సార్‌ జిల్లాలోని గండికోట ప్రపంచంలోనే అరుదైన ప్రాంతమని ఈ ప్రదేశానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించాలని గండికోట ప్రాధికార సంస్థ చైర్మన్‌ (గండికోట రాజ వారసుడు) పెమ్మసాని ప్రభాకర్‌నాయుడు ప్రొఫెసర్‌ జయరామిరెడ్డిని కోరారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా గురువారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసిన జయరామిరెడ్డిని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గండికోట చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని అందజేశారు. గండికోట, ఆ ప్రాంత అందాలను హెలికాఫ్టర్‌ ద్వారా వీక్షించే అవకాశాన్ని పర్యాటకులకు కల్పించాలని ఆయన కోరారు. దీనికి యునెస్కో గుర్తింపు కల్పించి అభివృద్దికి చేయూతనివ్వాలని కోరారు. గండికోటలో గాజు బాల్కని, స్కై వాక్, లైటింగ్, రోప్‌వే, రాక్‌ క్లైంబింగ్, బోటింగ్, అమ్యూజ్‌మెంట్‌ పార్కు, షాపింగ్‌ ఏరియా, రీసార్ట్స్‌లు తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే నవంబరులో జరగనున్న గండికోట వారసత్వ ఉత్సవాలకు తప్పక రావాలని ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement