భూపరిహారం అందించాలి
అనుమసముద్రంపేట: సోమశిల ఉత్తర కాలువకు సేకరించిన భూములకు పరిహారం వెంటనే అందజేయాలని ఏఎస్‌పేట మండల రైతులు డిమాండ్ చేశారు.
ఉత్తర కాలువ పనులను అడ్డుకున్న రైతులు
అనుమసముద్రంపేట: సోమశిల ఉత్తర కాలువకు సేకరించిన భూములకు పరిహారం వెంటనే అందజేయాలని ఏఎస్‌పేట మండల రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ పరిహారం అందించకుండా ఉత్తర కాలువ పనులు చేపట్టడంపై అక్బరాబాదు, కూనలమ్మపాడు రైతులు బుధవారం ఉత్తర కాలువ పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర కాలువకు రెండేళ్ల క్రితం భూసేకరణ జరిపినట్లు చెప్పారు. ఇప్పటి వరకు పరిహారం అందజేయలేదని తెలిపారు. పరిహారం అందజేయకుండా పనులు చేపడుతూ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. కలెక్టర్ హామీ ఇస్తేనే పనులు జరగనిస్తామన్నారు. ఈ ఆందోళనలో పార్టీలకు అతీతంగా రైతులు పాల్గొన్నారు.