ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా | Girlfriend protests at lovers house in medak district | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Dec 6 2015 7:56 PM | Updated on Sep 3 2017 1:36 PM

‘ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని వెంట పడితే బావే కదా అని నమ్మాను.. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు’ అంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

మెదక్: ‘ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని వెంట పడితే బావే కదా అని నమ్మాను.. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు’ అంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. నంగునూరు మండలం మగ్దుంపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన గీతను భాస్కర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. అతడు వరుసకు బావ కావడంతో సంవత్సరం పాటు కలిసి తిరిగారు. తనను పెళ్లి చేసుకోవాలని గీత కోరడంతో భాస్కర్ నిరాకరించాడు. దీంతో జులైలో భాస్కర్‌తో పాటు అతని తల్లిదండ్రులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారిని రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన భాస్కర్ హైదరాబాద్లో ఉంటున్నాడు. కాగా తనకు న్యాయం చేయాలంటూ గీత ఆదివారం ప్రియుని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భాస్కర్ ఇంట్లో కుటుంబసభ్యులు ఎవ్వరు లేకపోవడంతో ఆదివారం సాయంత్రం ఆమె వెనుదిరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement