ప్రియుడి పెళ్లిలో ప్రియురాలి గలాభా | Girlfriend Protest in Front of her Lover House in Nagavarappadu | Sakshi
Sakshi News home page

ప్రియుడి పెళ్లిలో ప్రియురాలి గలాభా

Apr 21 2017 1:07 PM | Updated on Aug 1 2018 2:15 PM

ప్రియుడి పెళ్లిలో ప్రియురాలి గలాభా - Sakshi

ప్రియుడి పెళ్లిలో ప్రియురాలి గలాభా

ప్రియుడి పెళ్లిని అడ్డుకునేందుకు ప్రియురాలు ప్రయత్నించిన ఘటన నాగవరప్పాడులో చోటుచేసుకుంది.

గుడివాడ: ప్రియుడి పెళ్లిని అడ్డుకునేందుకు ప్రియురాలు ప్రయత్నించిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలం నాగవరప్పాడులో శుక్రవారం చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరో యుతితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ లిల్లీ పుష్పం అనే యువతి తన ప్రియుడి ఇంటివద్ద ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో వరుడు తనను మోసం చేశాడని దుమ్మెత్తి పోసింది.

తనకు న్యాయం చేయాలని కోరినా పట్టించుకునేవారు లేకపోవడంతో పెళ్లి పందిట్లో సామాన్లు విసిరేసి నిరసన తెలిపింది. వరుడు కుటుంబ సభ్యులు ఆమెను అడ్డుకుని అక్కడి నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు స్పృహ తప్పి పడిపోయింది. వరుడి బండారం బట్టబయలు కావడంతో స్థానికులు అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement