 
															నచ్చిన ఛానల్ పెట్టలేదని బాలిక ఆత్మహత్య
													 
										
					
					
					
																							
											
						 టీవీ ఛానల్ విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ.. తండ్రి మందిలింపు... చివరికి ఓ బాలిక ఆత్మహత్యకు దారి తీసింది.
						 
										
					
					
																
	వాంకిడి : టీవీ ఛానల్ విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ.. తండ్రి మందిలింపు... చివరికి ఓ బాలిక ఆత్మహత్యకు దారి తీసింది. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కోమటిగూడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది.  
	 
	పోలీసుల కథనం ప్రకారం వి.జ్యోతి (13) మంగళవారం రాత్రి తెలుగు చానల్ పెట్టాలని కోరింది. పండుగకు మహారాష్ట్ర నుంచి పుట్టింటికి వచ్చిన జ్యోతి సోదరి హిందీ చానల్ పెట్టాలని పట్టుబట్టింది. ఈ విషయంలో జ్యోతిపై ఆమె సోదరి చేయి చేసుకుంది. తండ్రి రామారావు జోక్యం చేసుకుని చిన్నకుమార్తె జ్యోతిని మందలించాడు. మనస్తాపం చెందిన ఆమె రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.