ఫేస్‌బుక్ ప్రేమ విఫలమై.. | girl suicide attemt after fail her facebook love | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ ప్రేమ విఫలమై..

Sep 15 2015 9:12 AM | Updated on Jul 27 2018 12:33 PM

ఫేస్‌బుక్ ప్రేమ విఫలమై.. - Sakshi

ఫేస్‌బుక్ ప్రేమ విఫలమై..

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతిని ప్రేమించిన యువకుడు ఆమె ఇంటిముందే ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో జరిగింది.

కోవూరు: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతిని ప్రేమించిన యువకుడు ఆమె ఇంటిముందే ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పవన్‌కుమార్‌కు ఫేస్‌బుక్ ద్వారా కోవూరుకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. పవన్‌కుమార్ కోవూరు వచ్చి ఆ యువతిని కలసివెళ్లేవాడు. ఈ క్రమంలో వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో పెళ్లికి ససేమిరా అన్నారు. మరో యువకుడితో ఆమెకు వివాహ నిశ్చితార్థం జరిపించారు.

ఈ విషయం తెలుసుకున్న పవన్‌కుమార్ రెండు రోజుల కిందట తన తల్లి, సోదరితో కలసి కోవూరు వచ్చి ఆ యువతి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశాడు. వారు నిరాకరించడంతో పాటు ఆ యువతి కూడా తనను మరిచిపోవాలని సూచించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆమె ఇంటి ముందే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధిత కుటుంబసభ్యులు వెంటనే పవన్‌కుమార్‌ను నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement