కమాన్‌చౌరస్తా : హరితహారం విజయవంతం కావడంలో విద్యార్థుల పాత్ర కీలకమని జిల్లా విద్యాధికారి ఎస్.శ్రీనివాసాచారి అన్నారు. హరితహారంపై స్థానిక ధన్గర్‌వాడీ ఉన్నత పాఠశాలలో సోమవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి మొత్తం 26 మంది ఉపన్యాస, 26 మంది వ్యాసరచచ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు.
హరితహారంపై విద్యార్థులకు పోటీలు
Jul 18 2016 6:35 PM | Updated on Sep 18 2018 6:30 PM
కమాన్‌చౌరస్తా : హరితహారం విజయవంతం కావడంలో విద్యార్థుల పాత్ర కీలకమని జిల్లా విద్యాధికారి ఎస్.శ్రీనివాసాచారి అన్నారు. హరితహారంపై స్థానిక ధన్గర్‌వాడీ ఉన్నత పాఠశాలలో సోమవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి మొత్తం 26 మంది ఉపన్యాస, 26 మంది వ్యాసరచచ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. విజేతలను రాష్ట్ర స్థాయికి పంపించనున్నట్లు చెప్పారు. పోటీలకు పర్యవేక్షకులుగా హుజూరాబాద్ ఉపవిద్యాధికారి కె.ఆనందం వ్యవహరించారు. న్యాయనిర్ణేతలుగా కేఎస్.అనంతాచార్య, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, కేబీ శర్మ, కె,ముకుంధం, ఎస్.శ్రీనివాస్, బీఎన్‌ఆర్ శర్మ వ్యవహరించారు.
Advertisement
Advertisement