అదనపు ట్రాన్స్‌ఫార్మర్లకు బడ్జెట్‌ విడుదల చేయాలి | Fund will reales for Transfoarmers | Sakshi
Sakshi News home page

అదనపు ట్రాన్స్‌ఫార్మర్లకు బడ్జెట్‌ విడుదల చేయాలి

Sep 16 2016 11:35 PM | Updated on Sep 4 2017 1:45 PM

అదనపు ట్రాన్స్‌ఫార్మర్లకు బడ్జెట్‌ విడుదల చేయాలి

అదనపు ట్రాన్స్‌ఫార్మర్లకు బడ్జెట్‌ విడుదల చేయాలి

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓవర్‌లోడ్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అదనపు ట్రాన్స్‌ఫార్మర్లకు బడ్జెట్‌ విడుదల చేయాలని ప్రజాపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అధికారులను డిమాండ్‌ చేశారు.

నల్లగొండ టూ టౌన్‌ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓవర్‌లోడ్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అదనపు ట్రాన్స్‌ఫార్మర్లకు బడ్జెట్‌ విడుదల చేయాలని ప్రజాపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అధికారులను డిమాండ్‌ చేశారు. అధికారులు పంపిన ప్రతిపాదనలకు వెంటనే బడ్జెట్‌ విడుదల చేయాలని కోరుతూ పీఆర్పీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌లోని ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవర్‌లోడ్‌తో రైతుల ట్రాన్స్‌ఫార్మర్ల కాలిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. మండలాల అధికారులు అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ప్రతిపాదనలు పంపినా బడ్డెట్‌ విడుదల చేయకుండా నాన్చడం సరైంది కాదన్నారు. అనంతరం డీఈ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పీఆర్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గోపిరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, కుకుడాల దశరథరెడ్డి, సుధాకర్, ఎల్లెంల వీరయ్యయాదవ్, కె.సత్యనారాయణచారి, పరుశరామ్, నవీన్, సైదిరెడ్డి పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement