చెన్నై- హౌరా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు | fumes in Chennai- Howrah Express | Sakshi
Sakshi News home page

చెన్నై- హౌరా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

May 21 2016 5:17 PM | Updated on Sep 5 2018 9:47 PM

చెన్నై నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.

చెన్నై నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. రైలు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గోదారిపేట సమీపంలోకి రాగానే ఈ ఘటన జరిగింది. ఓ బోగీ నుంచి పొగలు, సన్నని మంటలు వచ్చినట్టు గుర్తించడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే రైలును ఆపేశారు. వాటిని ఆర్పివేసిన తర్వాత అరగంట ఆలస్యంగా రైలు బయల్దేరింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement