నేటి నుంచి జేవీవీ సైన్స్‌ సంబరాలు | from today jvv science festivals | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జేవీవీ సైన్స్‌ సంబరాలు

Nov 10 2016 12:30 AM | Updated on Sep 4 2017 7:39 PM

ఉండి : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో సైన్సు సంబరాలు నిర్వహిస్తున్నట్టు వేదిక జిల్లా నాయకుడు గాదిరాజు రంగరాజు తెలిపారు.

ఉండి : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో సైన్సు సంబరాలు నిర్వహిస్తున్నట్టు వేదిక జిల్లా నాయకుడు గాదిరాజు రంగరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉండిలో జేవీవీ సైన్సు సంబరాల పోస్టర్‌ను డీవైఈవో మద్దూరి సూర్యనారయణమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా డీవైఈవో మాట్లాడుతూ సైన్సుపై విద్యార్థులకు మక్కువ కలిగించడంలో జేవీవీ కృషి అభినందనీయమని అన్నారు. 26 సంవత్సరాలుగా సైన్సుపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు చెకుముకి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రంగరాజు తెలిపారు. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జెడ్పీ హైస్కూళ్లలో  8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. వేదిక శాఖ మండల ప్రధాన కార్యదర్శి దాసరి సునీల్‌కుమార్, నిమ్మల సత్యనారాయణ పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement