ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 8వ విడత మన గుడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్. దుర్గాప్రసాద్, ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు ఎంవీఎస్.సత్యనారాయణ తెలిపారు.
11 నుంచి ‘మన గుడి’
Nov 5 2016 12:27 AM | Updated on Sep 4 2017 7:11 PM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 8వ విడత మన గుడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్. దుర్గాప్రసాద్, ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు ఎంవీఎస్.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో టీఎస్.రవికుమార్, కెవీ.నరసింహాచార్యులు, ఎస్‌ఎస్.చక్రధర్, జీవీ.నాగేశ్వరరావు, సీహెచ్. సత్యనారాయణరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement