వికారాబాద్‌లో ఫ్రీ వైఫై సేవలు | free wifi in vikarabad | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో ఫ్రీ వైఫై సేవలు

Jul 21 2016 6:04 PM | Updated on Mar 28 2018 11:26 AM

వికారాబాద్‌లో ఫ్రీ వైఫై సేవలు - Sakshi

వికారాబాద్‌లో ఫ్రీ వైఫై సేవలు

సైబర్‌నెట్‌ వారు ఉచిత వైఫై సేవలను ప్రారంభించడం అభినందనీయమని, దీన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్‌ సీఐ జి.రవి అన్నారు.

వికారాబాద్‌ రూరల్‌: సైబర్‌నెట్‌ వారు ఉచిత వైఫై సేవలను ప్రారంభించడం అభినందనీయమని, దీన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్‌ సీఐ జి.రవి అన్నారు. పట్టణంలోని సైబర్‌నెట్‌ వారి ఆధ్వర్యంలో మొదటివిడతగా ప్రధాన కూడళ్లలో ఉచిత వైఫై సేవలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి పనులకు, సమాచార సేకరణకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్‌నెట్‌ అధినేత మోసిన్‌ఖాన్‌ మాట్లాడుతూ. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ముఖ్య లక్ష్యంగా సైబర్‌ నెట్‌ పనిచేస్తుందన్నారు. పట్టణంలో మొదటి విడతగా ఎన్‌టీఆర్‌ చౌరస్తా, బీజేఆర్‌ చౌరస్తా, రైల్వేస్టేషన్‌, కొత్తగడి, శివారెడ్డిపేట ప్రాంతాల్లో సేవలు ప్రారంభించామన్నారు. సైబర్‌నెట్‌ వినియోగదారులకు ఇంటర్నెట్‌ సేవలు మరింత మెరుగు పరిచేలా కృషి చేస్తామన్నారు. వికారాబాద్‌ ఎస్‌ఐ రవీందర్‌, సైబర్‌నెట్‌ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement