ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు కౌతాళం గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. ప్రమాదస్థలంలో ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.