మంత్రి కాన్వాయ్ ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు | four injured by minister's convoy | Sakshi
Sakshi News home page

మంత్రి కాన్వాయ్ ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు

Jul 24 2015 4:11 PM | Updated on Sep 3 2017 6:06 AM

మోటార్ బైక్ పై వెళుతోన్న ఓ కుటుంబానికి మంత్రి గారి వాహనం ప్రమాదం రూపంలో ఎదురై తీవ్ర గాయాలను మిగిల్చింది.

కొవ్వూరు: మోటార్ బైక్ పై వెళుతోన్న ఓ కుటుంబానికి మంత్రి గారి వాహనం ప్రమాదం రూపంలో ఎదురై తీవ్ర గాయాలను మిగిల్చింది.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం అరికిరేవుల సమీపంలో బైక్ పై వెళుతోన్న ఓ కుటుంబాన్ని మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ లోని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తోన్న ఎ. రాజు, అతని భార్య సంతోషి, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement