కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలి | form kalluru revenue division | Sakshi
Sakshi News home page

కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలి

Sep 9 2016 11:26 PM | Updated on Sep 4 2017 12:49 PM

సీఎస్‌ రాజీవ్‌శర్మకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

సీఎస్‌ రాజీవ్‌శర్మకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

మ్మం జిల్లాలో కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం సతుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఆఖిల పక్షనాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు

ఖమ్మం అర్బన్‌ : ఖమ్మం జిల్లాలో కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం సతుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఆఖిల పక్షనాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. అనేక ఏళ్లుగా ప్రతిపాదనలో ఉన్న కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. రెవెన్యూ జిల్లా ఏర్పాటు టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ ప్రదీప్‌చంద్రకు కూడా వినతిపత్రం అందించారు. వినతి అందించినవారిలో ఆఖిలపక్ష నాయకులు గొర్రెపాటి రాధయ్య, కాటంనేని వెంకటేశ్వరరావు, ఎన్‌.వెంకటేశ్వర్లు, జాస్త్రీ శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, దుర్గాప్రసాద్, రామలరాజు, అప్పిరెడ్డి, వెంకటేశ్వరరావు, అంజయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement